Wednesday, April 24, 2024

బన్నీ ఫ్యాన్స్​కి గుడ్​ న్యూస్​.. పుష్ప 2 మేకింగ్​ లాంచ్ అప్​డేట్​ ఏంటంటే..​

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన మూవీ పుష్ప. ఈ సినిమా టాలీవుడ్‌తో పాటు నార్త్ లోనూ అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి టాప్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో రియ‌లిస్టిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సుకుమార్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. పుష్ప‌రాజ్‌గా బ‌న్నీ న‌ట‌న‌, మేన‌రిజ‌మ్స్ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా పాపుల‌ర్ అయ్యాయి.

అయితే.. ప్ర‌స్తుతం పుష్ప సినిమాకు పుష్ప-ది రూల్ పేరుతో సీక్వెల్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సీక్వెల్ ప్రారంభం కోసం అల్లు అర్జున్ అభిమానులు దేశ‌వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. కాగా, బ‌న్నీ అభిమానుల‌కు మూవీ టీమ్ ఈ రోజు (ఆదివారం) ఒక గుడ్‌న్యూస్ వినిపించింది. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో రేపు (ఆగ‌స్ట్ 22 సోమ‌వారం) పుష్ప -2 లాంచ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement