Thursday, November 14, 2024

కరోనా పరిహారం లెక్కల్లో గోల్‌మాల్‌.. దర్యాప్తుకు సుప్రీం ఆదేశం

కరోనాతో మరణించిన వారి కుటుంబానికి కేంద్ర ప్రభుతం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. చాలా మంది సహజ మరణాలను కూడా కరోనా మరణాలుగా చూపి.. ఎక్స్ గ్రేషియా పొందినట్టు వస్తున్న ఆరోపణలపై సుప్రీం కోర్టు స్పందించింది. కరోనా పరిహారం లెక్కల్లో గోల్‌మాల్‌ జరిగినట్టు అనుమానిస్తున్న సుప్రీం కోర్టు.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దర్యాప్తునకు ఆదేశించింది. ఫేక్‌ క్లెయిమ్‌ల వెరిఫికేషన్‌ కోసం శాంపిల్‌ సరే కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై సరోన్నత న్యాయ స్థానం స్పందించింది. తప్పుడు కరోనా పరిహారానికి సంబంధించిన క్లెయిమ్స్‌ ఎక్కువగా ఉన్న నాలుగు రాష్ట్రాల్లో దర్యాప్తునకు ఆదేశించింది. 5 శాతం క్లెయిమ్స్‌ ఫేక్‌గా ఉన్నట్టు సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ క్లెయిమ్స్‌ను వెరిఫై చేయాల్సిందిగా.. కేంద్రానికి సూచించింది. నాలుగు రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు కేరళ ఉన్నాయి.

ఈ నాలుగు రాష్ట్రాల్లో కరోనా కారణంగా సంభవించిన మరణాలకు, క్లెయిమ్స్‌ మధ్య వ్యత్యాసం కనిపిస్తున్నది. మార్చి 28 వరకు సంభవించిన మరణాలపై 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్‌ హక్కుదారులు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా పరిహారం క్లెయిమ్‌ చేయడానికి 90 రోజుల గడువు విధించింది. కరోనా కారణంగా చనిపోయినట్టు చూపి.. రూ.50వేల నష్టపరిహారం పొందేందుకు.. కొంత మంది ప్రభుత అధికారుల సాయం తీసుకున్నట్టు సుప్రీం ఆరోపిస్తున్నది. వారితో కుమ్మక్కై అవినీతి రాకెట్లపై దర్యాప్తునకు సుప్రీం కోర్టు ఆదేశించాలని కేంద్ర ప్రభుతం శనివారం విజ్ఞప్తి చేసింది. గత విచారణ సందర్భంగా మార్చి 14న నిధులు దురినియోగంపై దర్యాప్తు చేయడానికి కంఎ్టోలర్‌, ఆడిట్‌ జనరల్‌ విచారణ అవసరమని బెంచ్‌ అభిప్రాయపడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement