Thursday, April 18, 2024

మళ్లీ పెరిగిన పుత్తడి ధరలు..

బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ సమయంలో కరోనా కేసులతో పాటుగా ధరలు కూడా పెరుగుతున్నాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 43, 510 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 10 పెరిగి రూ. 47, 470 కి చేరింది. ఇక అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకుండా.. స్థిరంగా నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: జగన్ ను కొందరు ఐఏఎస్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు: మోహన్ బాబు

Advertisement

తాజా వార్తలు

Advertisement