Saturday, April 20, 2024

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు..

దేశంలో బంగారం ధరలు స్థరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన ధరలు ఇటీవల తగ్గుముఖ పట్టాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు… తాజాగా స్థిరంగా నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 44,510 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 48,560 కి చేరింది. బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర రూ. 200 పెరిగి రూ. 69,800 పలుకుతుంది.

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement