Saturday, April 20, 2024

మగువలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు

మన దేశంతో మహిళలకు బంగారం అంటే ఎంత ప్రీతో అందరికి తెలిసిందే. ఏ శుభకార్యం జరిగిన బంగారానికి ఉన్న ప్రధాన్యత వేరు. అందుకే బంగారానికి ఎప్పుడు రేట్లు ఎక్కువగానే ఉంటాయి. రోజురోజుకి కి కూడా ధరలు పెరుగుతాయి. అయితే మన దేశంలో గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 10 తగ్గి రూ. 43,990 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 10 తగ్గి రూ. 47,990 కి చేరిది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. ఇక బంగారం ధ‌ర‌లు తగ్గితే… వెండి ధ‌ర‌లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధ‌ర రూ. 64,200 వ‌ద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి:తెలంగాణపై నీతిఆయోగ్ వైస్‌ చైర్మన్‌ ప్రశంసలు.. కేటీఆర్​ కృతజ్ఞతలు

Advertisement

తాజా వార్తలు

Advertisement