Friday, February 3, 2023

Gold Price Today: గుడ్ న్యూస్‌.. త‌గ్గిన బంగారం.. వెండి ధ‌ర‌లు..

ప‌సిడి ప్రియుల‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గ‌త కొంత‌కాలంగా పెరుగుతూ వ‌స్తున్న బంగారం, వెండి ధ‌ర‌లు ఇప్పుడు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన బంగారం ధర తులానికి రూ.200 మేర పతనమై.. రూ.52 వేల మార్కును తాకింది. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు హైదరాబాద్‌లో రూ.220 మేర తగ్గి రూ.56,730కి చేరింది. అంతకుముందు వరుసగా 5 రోజులు గోల్డ్ రేటు పెరగడం గమనార్హం. ఈ కాలంలో ఏకంగా రూ.1000కిపైనే బంగారం ధర పెరిగింది. హైదరాాబాద్‌తో పోలిస్తే దిల్లీలో గోల్డ్ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. దేశ రాజధానిలో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రేటు 22 క్యారెట్లకు రూ.200 తగ్గి రూ.52,150 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు ప్రస్తుతం రూ.210 తగ్గి రూ.56,890 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే బంగారం బాటలోనే పయనించింది. క్రితం రోజుతో పోలిస్తే రేటు తగ్గింది. దిల్లీలో వరుసగా రెండో రోజు సిల్వర్ రేటు పడిపోయింది. తాజాగా రూ.300 తగ్గగా.. కిలోకు రూ.72,200 మార్కుకు చేరింది. అంతకుముందు రోజు కూడా రూ.400 మేర పడిపోయింది. దాని కంటే ముందు వరుసగా 5 రోజులు రేటు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు తాజాగా రూ.500 పడిపోయి రూ.74,800 మార్కుకు చేరింది. అంతకుముందు రోజు కూడా 500 పడిపోవడం తెలిసిందే. ఇటీవల ఒక దశలో రేటు గరిష్టంగా రూ.75,800కు చేరడం కూడా తెలిసిందే.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement