Friday, April 19, 2024

Gold Price Today : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్… తగ్గిన బంగారం ధర..

బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర అక్టోబర్ 21న రూ.200 మేర తగ్గింది. అంతకుముందు రోజు ఈ రేటు రూ.46,550 వద్ద ఉండగా.. ప్రస్తుతం 46 వేల 350కి పతనం అయింది. ఇక 24 క్యారెట్ల విషయానికి వస్తే తులం బంగారం ధర హైదరాబాద్‌లో రూ.220 తగ్గి రేటు రూ.50 వేల 560కి చేరింది. సిల్వర్ ధర ఏకంగా రూ.500 తగ్గింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి రేటు రూ. 61 వేలకు పతనం అయింది. ఈ నెలలో సిల్వర్ రేటు భారీగా తగ్గింది. వరుసగా ఏడెనిమిది రోజులు నేలచూపులు చూసి వెండి.. అక్టోబర్ 18న మాత్రమే స్వల్పంగా పెరిగింది. మిగతా రోజుల్లో కలిపి ఏకంగా రూ.7000 మేర తగ్గడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement