Saturday, April 20, 2024

Gold Price Today: పసిడిప్రేమికులకు బిగ్ షాక్… నేటి బంగారం, వెండి ధ‌ర‌లు ఇవే..!

బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎన్నడూ లేని స్థాయికి పెరిగిపోతున్నాయి. ఇటీవల ఒక్కరోజే రూ.900 మేర పెరిగిన బంగారం ధర నిన్న రూ.100 పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు రూ.100 మేర పడిపోయి.. రూ. 46 వేల 800 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ హైదరాబాద్‌లో రూ.110 తగ్గి ప్రస్తుతం రూ.51 వేల 50 వద్ద ఉంది. ఇక సిల్వర్ విషయంలో ఆ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. నవంబర్ 8న రూ.400 పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.400 ఎగబాకి ప్రస్తుతం రూ.66 వేల 700 వద్ద కొనసాగుతోంది. సిల్వర్ రేటు గత నాలుగు రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.2700 మేర పెరిగింది. అక్టోబర్ 31న కేజీ వెండి రేటు రూ.63 వేల వద్ద ఉండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement