Thursday, April 18, 2024

బంగారం డిమాండ్‌ రెండేళ్ల గరిష్ఠం.. 50 శాతం మేర వృద్ధి : వరల్డ్ గోల్డ్ కౌన్సిల్

కొవిడ్ కార‌ణంగా అనేక మార్కెట్లు దెబ్బతిన్నాయి దీంతో బంగారం డిమాండ్‌ పుంజుకుంది. 2021లో బంగారం వార్షిక డిమాండ్‌ 4021 టన్నులుగా ఉంది. ఇది రెండేళ్ల గరిష్ఠంగా ఉంది. ఈ మేరకు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ తాజా గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది. 2021క్యు4 త్రైమాసికంలో బంగారం డిమాండ్‌ 1147 టన్నుగా ఉందని రిపోర్ట్‌ పేర్కొంది. 2019 రెండో త్రైమాసికం తర్వాత ఇదే అత్యధికమని పేర్కొంది. ఏడాదిపరంగా దాదాపు 50 శాతం మేర వృద్ధి నమోదయ్యిందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ పేర్కొంది.

గోల్డ్‌ కడ్డీలు, కాయిన్ల డిమాండ్‌ ఏడాదిపరంగా 31 శాతం పెరిగి 8 ఏళ్ల గరిష్ఠం 1180 టన్నుగా ఉందని రిపోర్ట్‌ వివరించింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుదల, కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక ఒడిదొడుకుల కారణంగా బంగారమే సురక్షితమని రిటైలర్లు భావిస్తుండడమే ఇందుకు కారణంగా ఉందని రిపోర్ట్‌ విశ్లేషించింది. కాగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలు మొదలయ్యాక 2021లో గోల్డ్‌ బాస్కెట్‌ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల కొనసాగుతోంది. వడ్డీ రేట్లు పెరుగుదల కూడా పెట్టుబడుల ఉపసంహరణపై ప్రభావం చూపుతోందని రిపోర్ట్‌ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement