Thursday, April 25, 2024

ప‌సిడి ప్రియుల కోసం… హైదరాబాద్ లో గోల్డ్ ఏటీఎం

టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త పుంతలు తొక్కుకున్న ఏటీఎం సేవులు.. ఇప్పుడు సరికొత్త విధంగా సేవలు అందించేందుకు ముందుకొస్తున్నాయి. హైదరాబాద్ కు గోల్డ్ ఏటీఎంలు రాబోతున్నాయి. ఈ మేరకు గోల్డ్ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్ తరుజ్ ప్రకటించారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో గోల్డ్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్డుల ద్వారానే బంగారాన్ని తీసుకునే వీలు ఈ ఏటీఎంలలో ఉండనుంది. నెలన్నర రోజుల్లో హైదరాబాద్ లోని గుల్జార్ హౌస్, సికింద్రాబాద్, అబిడ్స్ ప్రాంతాల్లో ఈ గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన వివరించారు.

వీటి ద్వారా బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి బంగారాన్ని డ్రా చేసుకునే వీలుంది. స్వచ్ఛత కలిగిన బంగారాన్ని వివిధ గ్రాముల్లో ఏటీఎంలలో అందుబాటులో ఉంచుతారు. 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారాన్ని ఈ ఏటీఎంల ద్వారా తీసుకునే వీలుంది. దీనికి సంబంధించి తమ సంస్థ పోస్ట్, ప్రీపెయిడ్ కార్డులను కూడా జారీ చేస్తామని చెప్పారు. కాగా గోల్డ్ ఏటీఎంలు ఇప్పటి వరకూ దుబాయ్, యూకేలలో అయిదు ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్నాయి. రానున్న రెండు మూడు నెలలలో ఈ గోల్డ్ ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏటీఎంల నుంచి యాభై గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని గోల్డ్‌ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్ తరుజ్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement