Wednesday, April 24, 2024

పెరిగిన బంగారం వెండి ధరలు…ఎక్కువ కాదు !!

దేశంలో బంగారం ధర మళ్ళీ పెరిగింది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా మళ్లీ ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో… బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10రూపాయలు పెరిగి రూ. 46,100 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి రూ. 42,260 కు చేరింది.

అయితే బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు కూడా కాస్త పెరిగాయి. కిలో వెండి ధర 10 రూపాయలు పెరిగి రూ. 69,710 కి చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement