Tuesday, May 30, 2023

గాడ్ ఫాద‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై – అప్ డేట్ ఇచ్చిన మేక‌ర్స్

ఏపీలోని అనంతపూర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో గాడ్ ఫాద‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబ‌ర్ 28న సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఈవెంట్ ను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు తాజాగా క్రేజీ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. వేలాది మంది నాయకుల ముందు నిల్చున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. చిరంజీవి ప్రధాన పాత్రలో న‌టిస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో స్టార్ న‌టులు సల్మాన్ ఖాన్, నయనతార నటించడంతో అభిమానులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. మరో పదిరోజుల్లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్, టైమ్ ఫిక్స్ చేస్తూ అఫిషియల్ అనౌన్స్ మెంట్ అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement