Tuesday, March 26, 2024

Delhi | జీవో 115 చెల్లుబాటు కాదు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖపట్నంకు చెందిన వ్యాపారవేత్త కాట్రగడ్డ లలితేశ్ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విశాఖపట్నం మర్రిపాలెంలో కేటాయించిన 17,135 చదరపు మీటర్ల భూమిని వెనక్కి తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 115ను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ మేరకు జీవోను కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. తొలుత ఈ జీవోను సవాల్ చేస్తూ వ్యాపారవేత్త కాట్రగడ్డ లలితేశ్ కుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, జీవోను కొట్టివేస్తూ సింగిల్ జడ్జ్ తీర్పునిచ్చారు.

- Advertisement -

ఈ తీర్పును డివిజన్ బెంచ్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయగా, ఏపీ హైకోర్టు సీజేఐ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పునే సమర్థించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. కాట్రగడ్డ లలితేశ్ కుమార్ కు కేటాయించిన స్థలాన్ని వెనక్కు తీసుకోవాలనుకున్న ఏపీ ప్రభుత్వం నిర్ణయం సరికాదన్న ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వమే స్థలాన్ని కేటాయించి మళ్లీ వెనక్కి ఎలా తీసుకుంటారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement