Wednesday, April 24, 2024

సైంధ‌వ్ ఫ‌స్ట్ గ్లింప్స్.. వెంక‌టేశ్ లుక్ అదిరిందిగా

గ‌త ఏడాది ఎఫ్3 చిత్రంతో హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నారు హీరో వెంక‌టేశ్.. కాగా ఓరి దేవుడా’ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలోను అలరించారు.తాజాగా ఆయ‌న కెరియర్ లో 75వ సినిమా తెర‌కెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ‘సైంధవ్’ అనే టైటిల్ తో కూడిన పోస్టర్ ను వదిలారు. వెంకీ రఫ్ లుక్ .. ఆయన గన్ పట్టుకున్న తీరు చూస్తుంటేనే, ఇది భారీ యాక్షన్ మూవీ అనే విషయం అర్థమవుతోంది. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.శైలేశ్ కొలను దర్శకత్వంలో ఆయన ఈ సినిమా చేయనున్నారనే విషయం అధికారికంగా బయటికి వచ్చింది.వెంకట్ బోయనపల్లి నిర్మాత‌.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement