Thursday, April 25, 2024

దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించండి.. కేంద్రమంత్రికి వికలాంగుల హక్కుల వేదిక వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.  వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు నాయకత్వంలోని బృందం కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి నారాయణ స్వామిని మంగళవారం న్యూఢిల్లీలో కలిసింది. దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలంటూ వినతిపత్రం సమర్పించారు. దేశ జనాభాలో ఐదు శాతం ఉన్న దివ్యాంగులకు రాజకీయాల్లో ఎలాంటి రిజర్వేషన్లు లేవని వాపోయారు.

గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎక్కడో పుట్టి ఎక్కడో  నివసిస్తున్న ఆంగ్లో ఇండియన్స్‌కి పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రాతినిథ్యం కల్పిస్తున్న ప్రభుత్వం, ఇక్కడ పుట్టి ఇక్కడే పెరుగుతున్నదివ్యాంగులకు ఎందుకు రిజర్వేషన్ కల్పించదని కొల్లి నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ సమావేశంలో అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక నాయకులు శ్రీనివాస్, పులి క్రాంతి, అజయ్ రామ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement