Friday, April 19, 2024

గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త సూచిక బోర్డులు

హైదరాబాద్ నగరంలో ఎక్కడికైనా వెళ్లాలంటే అడ్రస్ తెలుసుకోవడం అంత సులువు కాదు. కొందరు టెక్నాలజీ వాడుతూ గూగుల్ మ్యాప్స్ ద్వారా అడ్రస్ తెలుసుకుంటున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ వాడలేని వయసు మళ్లిన వారు ఒకచోట నుంచి ఇంకోచోటకు వెళ్లాలన్నా, కొత్తవారు ఫలానా ప్రదేశానికి పోవాలంటే ఇక్కట్లకు గురవుతున్నారు.

ఈ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ గ్రేటర్‌వ్యాప్తంగా స్ట్రీట్‌ సైనేజ్‌ పోల్స్‌ (వీధి సూచిక స్తంభాలు) ఏర్పాటు చేయబోతోంది. జోన్‌కు 500 చొప్పున గ్రేటర్‌లోని ఆరుజోన్లలో 3 వేల స్తంభాలను డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్‌వోటీ) పద్ధతిన ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఒక్కో పోల్‌పై ఐదు బోర్డులు ఏర్పాటు చేయనుండగా, పైభాగంలో జీహెచ్‌ఎంసీ సూచిక.. కింద నాలుగుబోర్డులు ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తారు. ఈ నూతన విధానంతో సులువుగా దారి తెలియడంతోపాటు జీహెచ్‌ఎంసీకి ఆదాయం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో బ్లాక్ ఫంగస్‌తో నలుగురు మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement