Thursday, April 25, 2024

ఘ‌నంగా గుణ‌శేఖ‌ర్ కుమారై వివాహం.. విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. త‌దిత‌ర ప్ర‌ముఖులు

ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయ‌న కుమారై నీలిమ గుణ.. వ్యాపారవేత్త రవి ప్రక్యాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహం హైదరాబాద్‌లో శనివారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఫలక్‌నుమా ప్యాలెస్‌ వేదికైంది. మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న భార్య సురేఖ‌.. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, బండ్ల గణేష్, డైరెక్టర్లు మెహెర్ రమేష్, అనిల్ రావిపూడి, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement