Friday, April 19, 2024

పక్కా క‌మర్షియ‌ల్ రిలీజ్ అప్పుడే..

మారుతీ తాజా చిత్రంగా రూపొందిన ‘పక్కా కమర్షియల్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేసేశారు సినీ టీమ్. జూలై 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్న‌ట్టు ప్ర‌క‌టించారు. యూవీ క్రియేషన్స్ – గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లపై నిర్మించిన ఈ సినిమాకి, జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించాడు. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా రాశి ఖన్నా అలరించనుంది.

రాశి ఖన్నా తన కెరియర్ తొలినాళ్లలోనే గోపీచంద్ తో కలిసి ‘జిల్’ వంటి హిట్ మూవీ చేసింది. ఆ తరువాత ఆ మధ్య మారుతి దర్శకత్వంలో ‘ప్రతి రోజూ పండగే’ చేసింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరితోను కలిసి ప్రేక్షకుల ముందుకు రానుంది. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న గోపీచంద్ కి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement