Tuesday, April 23, 2024

గేమ్ ఆన్ మూవీ టీజ‌ర్ రిలీజ్..

గీతానంద్‌, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీ-జర్‌ును హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన నటుడు విశ్వక్‌ సేన్‌ విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో గీతానంద్‌, నటు-డు ఆదిత్య మీనన్‌, దర్శకుడు దయానంద్‌, నిర్మాత రవి కస్తూరి, సంగీత దర్శకుడు నవాబ్‌ గ్యాంగ్‌, అశ్విన్‌ – అరుణ్‌, సినిమాటోగ్రాఫర్‌ అరవింద్‌ విశ్వనాథన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అశ్విన్‌ – అరుణ్‌ మాట్లాడుతూ ” ఈ సినిమాలో ఓ రొమాంటిక్‌ ట్రాక్‌ను కంపోజ్‌ చేసినట్టు చెప్పారు. నవాబ్‌ గ్యాంగ్‌ మాట్లాడుతూ ”డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ. దర్శకుడు సాంగ్స్‌ను కూడా డిఫరెంట్‌గానే కావాలన్నారు. మంచి సాంగ్స్‌ కుదిరాయి” అన్నారు. సినిమాటోగ్రాఫర్‌ అరవింద్‌ విశ్వనాథన్‌ మాట్లాడుతూ ” సినిమా బాగా వచ్చింది. ” అన్నారు. నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ ” గేమ్‌ ఆన్‌ సినిమాను ఓ పాపలాగా కేర్‌ తీసుకుని మరీ చేశాం. టీ-జర్‌ రిలీజ్‌ చేశాం. మీ అందరికీ విజువల్స్‌ నచ్చాయని భావిస్తున్నాను. అన్నారు. దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ ” గేమ్‌ ఆన్‌ మూవీ జర్నీలో చాలా మంది సహకరించారు. ఇది రెగ్యులర్‌ మూవీ కాదు. మా సినిమా ఓ మార్క్‌ క్రియేట్‌ చేస్తుందని అనుకుంటు-న్నాను. అన్నారు. ఆదిత్య మీనన్‌ మాట్లాడుతూ ఓ డిఫరెంట్‌ జోనర్‌లో చేసిన సినిమా గేమ్‌ ఆన్‌. రవిగారు ఆస్ట్రేలియా నుంచి వచ్చి.. ఈ సినిమా చేశారు. అన్నారు.
హీరో గీతానంద్‌ మాట్లాడుతూ ”గేమ్‌ ఆన్‌ టీ-జర్‌ చూడగానే విశ్వక్‌ ఫోన్‌ చేసి టీ-జర్‌ లాంచ్‌ చేస్తానని అన్నారు. ఈ సినిమా ఫలానా అని స్పెషల్‌ లేబుల్స్‌ అని ఇవ్వలేను. ఎందుకంటే ఇదొక కంప్లీట్‌ ప్యాకేజ్‌ మూవీ. అన్నారు. విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ గీతానంద్‌, దయానంద్‌లకు ఈ గేమ్‌ ఆన్‌ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు-న్నాను. అన్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement