Saturday, March 23, 2024

గాల్వాన్‌ అమర వీరుడి తండ్రి అరెస్టు..

భూ వివాదంలో గాల్వాన్‌ అమరవీరుడి తండ్రి పట్ల బీహార్‌ పోలీసుల వ్యవహార శైలి వివాదాస్పదమైంది. అర్ధరాత్రి ఇంటికి వచ్చి బలవంతంగా ఈడ్చుకెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. గాల్వాన్‌ దుర్ఘటనలో కొడుకును కోల్పోన ఓ తండ్రి, అమర జవాన్‌ స్మారకాన్ని ఏర్పాటు చేసేందుకు కేటాయించిన భూమికి సంబంధించిన విషయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల చర్యను నిరసిస్తూ గ్రామస్థులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు.

బీహార్‌కు చెందిన జయ్‌ కిశోర్‌ 2020 గాల్వాన్‌ ఘటనలో వీరమరణం పొందాడు. ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేసేందుకు అప్పట్లో ప్రభుత్వం చిన్న స్థలాన్ని కేటాయించింది. గతేడాది ఫిబ్రవరిలో జయ్‌కిశోర్‌ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి స్థానికులతోపాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఇటీవల ఈ స్మారకానికి చుట్టూ గోడ నిర్మించారు. దీంతో జయ్‌కిశోర్‌ తండ్రి రాజ్‌కపూర్‌ సింగ్‌పై ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు కొందరి ఫిర్యాదుతో కేసు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement