Saturday, April 20, 2024

నేపాల్‌తో బంధం మరింత బలోపేతం.. బుద్ధపూర్ణిమ వేడుకలకు హాజరు కానున్న ప్రధాని

న్యూఢిల్లి : నేపాల్‌తో బంధం మరింత బలోపేతం అయ్యేలా ప్రస్తుత ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. నేపాల్‌తో బాంధవ్యం అసమానమైనదని కాలపరీక్షలో నెగ్గిన ఆత్మీయ బంధమని అన్నారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా సోమవారంనాడు నేపాల్‌లోని లుంబిని బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ కలక ప్రకటన విడుదల చేశారు. తన పర్యటన సందర్భంగా నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బాతో ద్వైపాక్షిక, బహుళపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతానని వెల్లడించారు. గత నెలలో నేపాల్‌ ప్రధాని దేవ్‌బా భారత్‌ సందర్శించిన నేపథ్యంలో చర్చలు ఫలవంతమైనాయన్న విషయాన్ని ప్రధాని పేర్కొన్నారు.జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, అభివృద్ధి, ఇరు దేశాల మధ్య రాకపోకలకు సంబంధించిన రవాణా, మౌలిక వసతుల కల్పనవంటి అంశాలలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు.

శతాబ్దాల తరబడి ఇరు దేశాల మధ్య, ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు పరిపుష్టమయ్యాయన్న ఆయన వాటిని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. తన పర్యటన సందర్బంగా బుద్ధ జయంతి వేళ మాయాదేవి ఆలయంలో ప్రార్థనలు చేస్తానని, పవిత్ర బుద్ధుడి జన్మస్థలంలో భారతీయుల అందరి తరపున వినమ్ర నివాళి అర్పిస్తానని మోడీ పేర్కొన్నారు. లుంబినిలో నేపాల్‌ ప్రధాని దేవ్‌బాతో ద్వైపాక్షిక అంశాలపై విస్తృత చర్చలు జరుపుతానని వెల్లడించారు. 2014 తరువాత ప్రధాని మోడీ నేపాల్‌లో పర్యటించడం ఇదే ప్రథమం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement