Monday, October 14, 2024

Delhi | వరద ప్రభావిత రాష్ట్రాలకు నిధులు విడుదల..

దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర ప్ర‌భుత్వం నిధులు విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు.. నష్టం అంచనా వేసి ఇచ్చిన నివేదిక మేరకు కేంద్రం నిధులు కేటాయించింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ACRAF), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) నుండి మొత్తం 14 రాష్ట్రాలకు రూ.5,858.60 కోట్లు విడుదలయ్యాయి.

కాగా, కేంద్ర బృందాల నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు హోంశాఖ పేర్కొంది. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1,432 కోట్లు కేటాయించిన కేంద్ర హోంశాఖ…. ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416.80 కోట్లు మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement