Friday, March 29, 2024

Spl Story | స‌మ్మ‌ర్‌లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.. హాలీడేస్‌ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్న నిర్మాత‌లు

ఈ స‌మ్మ‌ర్ సినియాల‌తో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పంచ‌నుంది. కొత్త కొత్త సినిమాల‌తో హాలీడేస్ జోష్‌గా గ‌డ‌వ‌నున్నాయి. అయితే.. నిర్మాత‌లు కూడా వేస‌వి సెల‌వుల‌ను క్యాష్ చేసుకునేలా కొత్త సినిమాల రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా చిరంజీవి, స‌మంత, అల్ల‌రి న‌రేశ్‌, రాఘ‌వ లారెన్స్‌, విజ‌య్ ఆంటోనీ త‌మ సినిమాల‌తో ప్రేక్ష‌ల‌ముందు క్యూ క‌డుతున్నారు. మ‌రి ఎవ‌రి సినిమా ఎండాకాలాన్ని మ‌రిపించేలా ఎంజాయ్‌మెంట్ పంచుతుందో వేచి చేద్దాం..

-ఇంట‌ర్నెట్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

ఏడాది మొత్తంలో వేస‌వి కాలం సినిమాలకు చాలా అనుకూలమైన సీజన్ అనే చెప్పాలి. చాలా మంది చిత్ర నిర్మాతలు ఈ సీజ‌న్లో వ‌చ్చే సెలవులను క్యాష్ చేసుకోవడానికి ట్రై చెస్తుంటారు. ఎక్కువ‌ సినిమాలను విడుదల చేసెందుకు ప్లాన్ చేస్తుంటారు. ఈ వేసవి కూడా అదేవిదంగా ఉండ‌బోతోంది. డిఫ‌రెంట్ జోన‌ర్స్ లో చిన్న, పెద్ద సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యేందుకు రెఢీ అవుతున్నాయి. దీంతో సినీ అభిమానుల‌కు ఈ వేస‌వి మ‌రింత వినోదం పంచ‌నుంది.

  • ఈ స‌మ్మ‌ర్ లో రిలీజ్ అయ్యే సినిమా లిస్ట్ లో మొదటి స్థానంలో గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం ఉంది. ఈ సినిమా నవంబర్ 2022లో విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రేక్షకాభిమానుల‌కు బెస్ట్ ఎక్స్ పీరియ‌న్స్ ని అంధించేందుకు ఏప్రిల్ 14కి దీన్ని వాయిదా వేశారు మేకర్స్. ఇక‌, ఈ సినిమా 3డీలో కూడా విడుదల కానున్న సంద‌ర్భంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
  • అల్లరి నరేష్ మరో డిఫరెంట్ సబ్జెక్ట్ తో రాబోతున్నాడు. అల్ల‌రి న‌రేష్ కి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింద‌నే చెప్పాలి. అల్లరి నుంచి యాక్ష‌న్ నరేష్ గా మారాడు. త‌న స్క్రిప్ట్ సెల‌క్ష‌న్ తో అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాడు. నరేష్ కి నాంది లాంటి సూపర్ హిట్ ఇచ్చిన విజయ్ కనకమేడల దర్శకత్వంలోనే మ‌రో సినిమా రానుంది. ఉగ్రమ్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన వీడియో చాలా ప్రామిసింగ్ గా ఉంది. దీంతో సినిమాపై మ‌రింత ఎక్స్ పెక్టేష‌న్స్ అండ్ ఎక్సైట్ మెంట్ పెరిగాయి అనే చెప్పాలి.
  • మాస్ అండ్ హార‌ర్ జోన‌ర్ లో మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న రాఘవ లారెన్స్. కతిరేసన్ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రుద్రుడు పేరుతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఇదే సినిమా తమిళంలో రుద్రన్ అనే పెరుతో రిలీజ్ కానుంది. కాగా, ఈ మూవీ ఏప్రిల్ 14 న మ‌ల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ కానుంది.
  • మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నెక్ట్ ప్రాజెక్ట్ భోళా శంకర్. మంచి మాస్ మ‌సాలా మూవీగా చెప్తున్నారు. ఈ సినిమా వాస్తవానికి ఏప్రిల్ 14 న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే పెండింగ్‌లో ఉన్న షూట్ వర్క్ కారణంగా రిలీజ్ కి కొద్దిగా లేట్ కావ‌చ్చు. 2015లో త‌మిళంలో వ‌చ్చిన‌ వేదాళం మూవీ అధికారిక రీమేక్ భొళా శంక‌ర్. ఈ మూవీ ఇందులో తమన్నా, కీర్తి సురేష్‌లతో చిరంజీవిలో క‌నిపించ‌నున్నారు. మొత్తానికి అయితే భోళా శంకర్ సినిమాని ఇదే ఏడాది మే నెల‌లో థియేటర్లలో రిలీజ్ చేసెందేకే ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్.
  • ఇక‌.. విజయ్ ఆంటోని న‌టించిన బిచ్చ‌గాడు మొదటి భాగం అటు త‌మిళంతో పాటు ఇటు తెలుగులో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ సెకండ్ పార్ట్ కూడా రానున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ ఆంటోని స్వ‌యం దర్శకత్వంలో వ‌స్తున్న‌ తొలి చిత్రం పిచైకారన్ 2. తెలుగులోనూ రిలీజ్ కానున్న ఈ సినిమా బిచ్చగాడు 2 అనే పెరుతో రూపోందుతుంది. ఈ సినిమా కూడా ఏప్రిల్ 14న విడుదలవుతుందని తాజా స‌మాచారం. ఇక ఇటీవల బిచ్చ‌గాడు 2 నుంచి రిలీజ్ అయిన‌ స్నీక్ పీక్ వీడియో ఈ మూవీపై మరింత‌ క్యూరియాసిటీని పెంచింది. రాబోయే రోజుల్లో ఇప్పటికే ఉన్న ఈ లిస్ట్ లో మరికొన్ని సినిమాలు చేరే అవ‌కాశం లేక‌పోలేదు. మరి వీటిలో ఏ సినిమా సమ్మర్ సీజన్‌ని సద్వినియోగం చేసుకుని విజయం సాధిస్తుందో చూద్దాం.
Advertisement

తాజా వార్తలు

Advertisement