Friday, April 26, 2024

ఇక అన్ని వాహనాలకు ఇంధన వినియోగ ప్రమాణాలు.. ఏప్రిల్‌ నుంచి అమలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : : ఏ కేటగరీకి చెందిన వాహనమైనా సరే… ఇంధన వినియోగ ప్రమాణాలను పాటించాల్సిందే. వచ్చే ఏడాది(2023) ఏప్రిల్‌ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితమే తీసుకున్న ఈ నిర్ణయం… అమలులో ఇప్పటికే జాప్యం చోటుచేసుకుంది. ఇక విషయానికొస్తే… కాలుష్యాన్ని నియంత్రించడం, కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించడం, ఇంధనాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోగలిగే వాహనాలను ప్రవేశపెట్టడం లక్ష్యాలుగా… వినియోగ ప్రమాణాల అమలు అంశాన్ని ఖచ్చితంగా పాటించేలా కేంద్రం నిర్ణయం తీసపుకుంది. తేలికపాటి, మధ్య తరహా, భారీ వాహనాలు ఇంధన వినియోగ ప్రమాణాలు అమలుచేసేలా కేంద్రం త్వరలో ప్రకటన చేయనుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలిలా ఉన్నాయి.

ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్‌—149 ప్రకారం ఆయా ఉత్పత్తుల అనుగుణ్యత ప్రాతిపదికన ఇంధన వినియోగానికి సంబంధించి ప్రతీ వాహనానికి కూడా నిరంతర ధృవీకరణ అవసరం. రహదారులు, రువాణా మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌హెచ్‌)… నేషనల్‌ మోటార్‌ వెహికిల్స్‌ చట్టాన్ని సవరించిన విషయం తెలిసిందే. కాగా… ఈ ప్రమాణాలకు సరితూగని వాహనాలు సహా యజమానాలపై కఠినచర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర రహదారులు, భవనాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర తాజాగా ఆమోదించింది. ఈ క్రమంలో… కొత్త నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే… ఈ ఏడాది అక్టోబరు లేదా డిసెంబరు నెలల్లో… వాహన తయారీదారుల సంస్థల ప్రతినిధులతో మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇదిలా ఉంటే… కొత్తగా తయారుకానున్న వాహనాలకు సంబంధించి ఈ మార్గదర్శకాలు ఎలాగూ అమలవుతాయని, అయితే కేంద్రం భావిస్తున్నట్లుగా 2017 నుంచి మార్కెట్‌ వాహనాలకు కూడా ఈ నిబంధనలు వర్తించేలా చూడడమే సమస్యగా మారుతుందని వాహనాల తయారీ కంపెనీలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement