Thursday, April 25, 2024

రేపటి నుంచి రెవెన్యూ క్రీడా, సాంస్కృతిక పోటీలు, ఏఎన్‌యూలో ఏర్పాట్లు.. 12వందల మంది క్రీడాకారుల రాక

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర రెవెన్యూ క్రీడా, సాంస్కృతికోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.. వివిధ జిల్లాల నుంచి 12 వందల మంది వరకు ఉద్యోగులు గ్రామ రెవెన్యూ సహాయకుని నుంచి డిప్యూటీ- కలెక్టరు స్థాయి వరకు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణమూర్తి, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎం విశ్వేశ్వరనాయుడు మీడియాకు వివరించారు. నవంబర్‌ 11నుండి 13 వ తేది వరకు (మూడు రోజులు) ఆచార్య నాగార్జున యునివర్సిటీ ప్రాంగణంలో రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలు – 2022 నిర్వహిస్తామన్నారు.

10, 11, 12వ తేదీల్లో సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరగుతాయని చెప్పారు. పోటీల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే క్రీడల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ నవంబర్‌ 10, 11 మరియు 14వ తేదీలలో మూడు రోజులు ప్రత్యేక సెలవు దినాలుగా ప్రకటించింది. 12, 13 (రెండవ శనివారం, ఆదివారం) సెలవు దినాల్లో పర్మిషన్‌ మంజూరు చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసింది.13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికిన మరియు సిటీ- సెంటర్‌ (సీసీఎల్‌ఏ) నుండి 1200 మంది క్రీడాకారులు 10 వ తేది ఉదయం 10. ఒఒగ లకే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ- కి చేరుకుంటారని వివరించారు.

6 వ రాష్ట్ర స్థాయి రెవిన్యూ క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవములు – 2022 ప్రార్రంభ ఉత్సవములు తేదీ 11.11.2022 (శుక్రవారం) న ఉదయం 9 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేష్రన్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ లాంఛన ంగా ప్రారంభించనున్నారు. ప్రారంభ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా అంతర్జాతీయ బాడ్మెం-్టట-న్‌ క్రీడాకారిణి, ఒలింపిక్‌ మెడలిస్ట్‌, డిప్యూటీ- కలెక్టరు అయిన కుమారి పీవీ సింధు, రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ తదితర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. 13న ఆదివారం సాయింత్రం 4 గంటలకు జరిగే ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాద రావు, ప్రభుత్వ సలహాదారు, సజ్జల రామకృష్ణా రెడ్డి పాల్గొంటారని ఏపీఆర్‌ఎస్‌ఏ నేతలు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement