Tuesday, April 23, 2024

అలర్ట్.. జూన్ 1 నుంచి తప్పనిసరి

బంగారంపై జూన్ 1 నుంచి ‘హాల్ మార్క్’ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పసిడి స్వచ్ఛతను నిర్ధరించే ఈ హాల్​మార్క్​ పద్ధతిని అమలు చేయాలని 2019 నవంబర్​లో కేంద్రం నిర్ణయించింది. దీనికోసం వ్యాపారులకు 2021 జనవరి 15 వరకు గడువు ఇచ్చింది. కరోనా నేపథ్యంలో వ్యాపారుల వినతి మేరకు ఈ గడువును జూన్ 1 వరకు పెంచింది. ఇకపై గడువును పొడగించేది లేదని తాజాగా స్పష్టం చేసింది. ఇప్పటివరకు 34,647 మంది వ్యాపారులు బీఐఎస్​తో రిజిస్టర్ అయ్యారు. వచ్చే రెండు నెలల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుందని అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి… 14, 18, 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే విక్రయించేందుకు అనుమతులు ఉంటాయని వారు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement