Friday, May 20, 2022

జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో ఉచిత డయాలసిస్‌ సేవలు.. త్వరలోనే అందుబాటులోకి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వైద్య సేవలు బలోపేతమవుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ బలోపేతానికి సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యతనిస్తుండటంతోపాటు మంత్రి హరీష్‌రావు ప్రత్యేక చొరవతో ఖరీదైన, అరుదైన వైద్య సేవలు కూడా పేద, సామాన్య రోగులకు అందుబాటులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకాకముందు వివిధ జిల్లాల రోగులు మామూలు వైద్య సేవలకు కూడా హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, వరంగల్‌ ఎంజీఎం వంటి పెద్దాసుపత్రులకు వెళ్లేవారు. అయితే ఇప్పుడు జిల్లాల్లోనూ మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రత్యేకించి మంత్రి హరీష్‌రావు చొరవతో కిడ్నీ వ్యాధి గ్రస్థుల కోసం జిల్లా ఆసుపత్రుల్లోనే డయాలసిస్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

పెరుగుతున్నకిడ్నీ బాధితులను దృష్టిలో ఉంచుకుని డయాలిస్‌ కేంద్రాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలోనే నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఏరియా ఆసుపత్రితోపాటు సిద్ధిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి, హుస్నాబాద్‌కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, జగిత్యాల జిల్లా ధర్మపురి ఆసుపత్రి, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో డయాలసిన్‌కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఒక్కో కేంద్రంలో అయిదు డయాలసిస్‌ యంత్రాలను ఏర్పాటు చేయయనున్నారు. గతంలో డయాలసిస్‌ కోసం రోగిని వారంలో రెండు పర్యాయాలు సుదూరంలో ఉన్న హైదరాబాద్‌, వరంగల్‌ వంటి పెద్దాసుపత్రులకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులుఉండేవి. దాంతో కిడ్నీ రోగులు అటు ఆర్థికంగా, ఇటు ప్రయాణ బడలికతో ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో మార్పు వస్తోంది. జగిత్యాల జిల్లా కేంద్రంతోపాటు వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లా ఆసుపత్రుల్లోనూ డయాలసిస్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని అంతర్గత ముఖ్య పట్టణాల్లోనూ డయాలసిస్‌ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్క జగిత్యాల జిల్లాలోనే ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గకేంద్రాలతోపాటు చొప్పదండి నియోజకవర్గ కేంద్రానికి ఒక్కో డయాలసిస్‌ కేంద్రం మంజూరైంది. ఇప్పటికే ఉన్న డయాలసిస్‌ కేంద్రాల్లో పడకల సంఖ్యను పెంచడంతోపాటు డయాలసిస్‌ మిషన్ల సంఖ్యనుకూడా వైద్య ఆరోగ్యశాఖ పెంచుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement