Wednesday, April 24, 2024

టీశాట్‌లో పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్‌.. పరీక్షలకు డిజిటల్‌ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు

హైదరాబాద్‌ ఆంధ్రప్రభ : వేలకు వేల రూపాయలు వెచ్చించి ప్రైవేట్‌ కోచింగ్‌ కేంద్రాల్లో కోచింగ్‌ తీసుకోని వారి కోసం టీశాట్‌ ఉచిత కోచింగ్‌ను ఇవ్వనుంది. ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలకానున్న నేపథ్యంలో అభ్యర్థులకు డిజిటల్‌ శిక్షణనిచ్చేందుకు టీశాట్‌ చర్యలు చేపట్టింది. టెలిపాఠాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2, టెట్‌, టీచర్‌ పోస్టులు, పోలీసు, వైద్యారోగ్యశాఖతో పాటు ఇతర పలు పోస్టులకు పోటీపడుతున్నవారికి ఉచిత శిక్షణనిచ్చేందుకు టీశాట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే టెట్‌ నోటిఫికేషన్‌ పడడంతో ముందస్తుగా టెట్‌ అభ్యర్థులకు ఏప్రిల్‌ 4 నుంచి శిక్షణ ప్రారంభంకానున్నది. ప్రస్తుతానికి టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)కు ఏప్రిల్‌ 4 నుంచి మే 4 వరకు మొత్తం 60 రోజుల పాటు 102 ఎపిసోడ్ల ద్వారా శిక్షణనివ్వనునున్నారు. ఉదయం, మధ్యాహ్నం ఒక్కో సబ్జెక్టుకు 30 నిమిషాల చొప్పున పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నట్లు తెలిసింది.

త్వరలోనే గ్రూప్స్‌కు..

త్వరలోనే గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశముండడంతో ఈ శిక్షణను సైతం త్వరలోనే ప్రారంభించాలని టీశాట్‌ అధికారులు భావిస్తున్నారు. రోజుకు రెండు గంటల పాటు గ్రూప్‌-1కు శిక్షణనిచ్చేలా అధికారులు ఆదిశగా ప్రణాళికలు రచిస్త్తున్నారు. ఇప్పటికే పాఠ్యాంశాల రికార్డింగ్‌ ప్రక్రియను చేపట్టినట్లు సమాచారం. నోటిఫికేషన్‌ విడుదలైన నాలుగైదు రోజుల్లోనే శిక్షణను ప్రారంభించాలని లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించి టీశాట్‌ 1500 గంటల నిడివి గల వీడియోరికార్డులను సిద్ధం చేసింది. నోటిఫికేషన్లు విడుదల కాగానే అవసరాన్ని బట్టి ఒక్కో పోటీ పరీక్ష శిక్షణా తరగతులు ప్రసారాలు ప్రారంభం కానున్నాయి.

ఏప్రిల్‌ 1 నుంచి అవగాహన తరగతులు…

శిక్షణకు ముందు వారం రోజులపాటు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ముందస్తుగా ఓరియంటేషన్‌ తరగతులు నిర్వ#హస్తారు. ఇందులో సబ్జెక్టులు, సిలబస్‌, పరీక్షా విధానం, ప్రిపరేషన్‌ టెక్నిక్స్‌పై అభ్యర్థులకు అవగా#హనను కల్పిస్తారు. పరీక్షలకు సంబంధించిన సందేహాలను సైతం నివృత్తి చేస్తారు. టెట్‌ అభ్యర్థుల కోసం ఏప్రిల్‌ 1 నుంచి 7 వరకు ఓరియంటేషన్‌ను నిర్వ#హంచాలని టీశాట్‌ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఏప్రిల్‌ 4 నుంచి టెట్‌కు శిక్షణను ప్రారంభించనున్నారు. అభ్యర్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ఆన్‌లైన్‌లో 100 ప్రశ్నలకు మాక్‌టెస్టును నిర్వహిస్తారు. పరీక్షా సమయం ముగియగానే ఎస్‌ఎంఎస్‌ రూపంలో ఎన్ని మార్కులు సాధించారో సమాచారాన్ని అందిస్తారు. అభ్యర్థులు కోరుకుంటే డిజిటల్‌ ప్రశ్నపత్రాన్ని వారి మెయిల్‌ ఐడీకి పంపిస్తారు. ఇందుకోసం టీశాట్‌ అన్ని సబ్జెక్ట్‌లకు కలిపి 50వేల ప్రశ్నలతో క్వశ్చన్‌బ్యాంక్‌ను సిద్ధం చేసినట్లు తెలిసింది. అభ్యర్థులు ఎన్నిసా్లంనా ఈ మాక్‌టెస్ట్‌లకు హాజరుకావొచ్చు. తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లోని ఈ మాక్‌టెస్ట్‌లను వెయ్యిసార్లు రాసినా ప్రశ్నపత్రాలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement