Monday, March 25, 2024

సెహ్వాగ్‌ నోట పవన్‌ కళ్యాణ్‌ మాట

పవన్‌ కెరీర్‌లో గబ్బర్‌ సింగ్ సినిమాకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస పరాజయాల తర్వాత విజయాన్ని అందించిన ఈ చిత్రం పవన్‌కు స్పెషల్‌ మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలో పవన్‌ చెప్పిన ‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అనే చెప్పే డైలాగ్ ఆయన ఫ్యాన్స్‌ను ఫుల్‌ ఖుషీ చేసింది.

అయితే తాజాగా స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ఇదే డైలాగ్‌ను చెప్పి అందరినీ ఆకట్టుకున్నాడు. మొబైల్‌లో పవన్‌ డైలాగ్‌ చెబుతున్న వీడియోను చూస్తూ.. పక్కన అమ్మాయి సాయం చేస్తుండగా సెహ్వాగ్‌ డైలాగ్‌ను పలికిన తీరు అభిమానులను ఫిదా చేస్తోంది. అయితే ఈ వీడియో ఎప్పడిదో తెలియనప్పటికీ ప్రస్తుతం నెట్టింట మాత్రం వైరల్‌గా మారింది. మరి సెహ్వాగ్‌, పవన్‌ డైలాగ్‌ను ఎలా చెప్పాడో మీరూ వినేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement