Thursday, April 25, 2024

కరోనాతో IMA మాజీ అధ్యక్షుడు కన్నుమూత

ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) మాజీ అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్ కరోనా కాటుకు బలయ్యారు. ఇటీవల కోవిడ్ బారిన పడిన ఆయన.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. 62 ఏళ్ల అగర్వాల్.. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా మహమ్మారికి బలవ్వడం కలచివేస్తోంది. కాగా వైద్య రంగంలో సేవలకు గుర్తింపుగా అగర్వాల్‌కు 2010లో పద్మశ్రీ అవార్డు దక్కింది. కరోనా కల్లోలంలో కూడా ఆయన జనాలను చైతన్యపరిచేందుకు అనేక వీడియోలు, విద్యా కార్యక్రమాలు రూపొందించి విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement