Sunday, June 13, 2021

దివంగత మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి కన్నుమూత

దివంగత మాజీ సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి సతీమణి రాఘవమ్మ (97) ఆదివారం ఉదయం కన్నుమూత మూశారు. వయోభార అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమాజిగూడలోని తన స్వగృహంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. రాఘవమ్మ మృతితో ఆమె స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా రాఘవమ్మ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News