Saturday, May 8, 2021

ఆసీస్ క్రికెటర్ మెక్‌గిల్ కిడ్నాప్.. నలుగురి అరెస్ట్

ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఒక‌ప్పుడు స‌త్తా చాటిన స్టార్ స్పిన్న‌ర్ స్టువర్ట్ మెక్‌గిల్ కిడ్నాప్ అయ్యాడు. అతడిని కిడ్నాప్ చేసిన కేసులో పోలీసులు న‌లుగురిని అరెస్ట్ చేశారు. సిడ్నీలో బుధ‌వారం తెల్ల‌వారుఝామున‌ వాళ్ల‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఆస్ట్రేలియా క్రికెట్‌లో షేన్ వార్న్ సత్తా చాటుతున్న స‌మ‌యంలోనే మెక్‌గిల్ కూడా అరంగేట్రం చేశాడు. అత‌నితో పోటీ ప‌డి వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా త‌ర‌ఫున 44 టెస్టులు కూడా ఆడాడు.

50 ఏళ్ల మెక్‌గిల్‌ను గ‌త నెల 14న ముగ్గురు వ్య‌క్తులు వ‌చ్చి కిడ్నాప్ చేశారు. ఓ వాహ‌నంలో అత‌న్ని తీసుకెళ్లారు. సిడ్నీ నుంచి దూరంగా తీసుకెళ్లి ఓ బిల్డింగ్‌లో బంధించి అత‌న్ని తీవ్రంగా చితకబాది.. గ‌న్‌తో బెదిరించారు. అత‌ని నుంచి వాళ్లు భారీ మొత్తం డిమాండ్ చేశారు. గంట త‌ర్వాత మెక్‌గిల్‌ను విడిచి పెట్టారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు మొత్తానికి న‌లుగురిని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News