Friday, December 2, 2022

ఆవుల మంద‌పై పులి దాడి.. అడ‌విలోకి వెళ్ళొద్దంటూ హెచ్చ‌రిక‌లు..

పులిసంచ‌రిస్తుంద‌ని మహబూబాబాద్ జిల్లా దొరవారి తిమ్మాపురం నెలవంచ అటవీ ప్రాంతం ప్ర‌జ‌లు చెబుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం ఆవులమంద పై పులి దాడి చేసి రెండు ఆవులను చంపింది. కాగా రెండవ అవు మిగతా భాగాన్నిపులి గత రాత్రి తన ఆవాసానికి తీసుకెళ్లినట్లు అటవీశాఖ అధికారులు వెల్ల‌డించారు. ఆవు కళేబరం దగ్గర ఏర్పాటు చేసిన కెమెరాలకు పులి అనవాలు దొరకలేదని అటవీశాఖ అధికారులు చెప్పారు. గ్రామస్తులను అడవిలోకి వెళ్ల వద్దంటూ మహబూబాద్ డిఎఫ్ఓ రవి కిరణ్ సూచించారు..కాగా పులి ఉచ్చులో పడినట్టు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.. దాని అరుపులు గత రాత్రి నుండి వినబడుతున్నాయ‌ని వారు తెలిపారు. ఈ విషయాన్ని అటవీ అధికారులు నిర్ధారించక‌ గోప్యంగా ఉంచుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement