Sunday, March 24, 2024

పోడుకు పరిష్కారం..అడవికి వికాసం!


ముఖ్యమంత్రి కేసీఆర్‌ నయా ప్లాన్‌

  • నేడు పోడు సమస్య పరిష్కారానికి కీలక నిర్ణయాలు – అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష – ఇప్పటికే కమిటీలతో కసరత్తు పూర్తిచేసిన అధికారులు – నివేదిక అందజేసిన మంత్రివర్గ ఉపసంఘం – అటవీ ప్రాంతాల్లో గంజాయిసాగుకు చెక… -ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల రద్దు నిర్ణయం
    హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పోడు సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆదివాసీ గిరిజనుల పోడు సమస్యను పరిష్కరించడంతో పాటు అడవికి మరింత రక్షణ కవచం ఏర్పాటు చేసే దిశగా ప్రగతిభవన్‌లో జరిగే సమీక్షలో సీఎం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పోడు సమస్య పరిష్కారానికి పట్టుదలగా వ్యవహరి స్తున్న సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ ఉపసంఘాన్ని మంత్రులు సత్యవతిరాథోడ్‌, పువ్వాడ అజయ్‌ నేతృత్వంలో ఏర్పాటుచేసి నివేదిక తెప్పించుకు న్నారు. ఆ నివేదిక ఆధారంగా సీఎస్‌ సోమేష్‌ కుమార్‌కు గిరిజన, అటవీ శాఖల అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పలు అంశాలపై నివేది కలు, క్షేత్రస్థాయి స్థితిగతులు కోరారు. సీఎం ఆదే శాల నేపథ్యంలో సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ వివిధ శాఖల అధికారులు, కలెక్టర్లతో భేటీలు నిర్వహిం చగా, రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాలకు వెళ్ళి అసలు పరిస్థితిని తెలుసుకున్నారు. మరోవైపు గంజాయి, గుట్కా,
    మాదకద్రవ్యాల అదుపుకు సీఎం ఆదేశాల నేపథ్యంలో మంత్రి శ్రీనివాసగౌడ్‌ శుక్రవారం అధికారులతో సమీక్షలు జరిపారు. అటు గిరిజనులు ఏళ్ళుగా ఎదురుచూస్తున్న సమస్యను పరిష్కరించడంతో పాటు గంజాయిసాగుకు చెక్‌ పెట్టేలా.. గిరిజన ఆర్మీకి ప్రత్యేక బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనలు సీఎం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
    దరఖాస్తులు ఎలా
    పోడుభూములకు సంబంధించి గిరిజనులకు ఫలసాయం పొందే హక్కు కల్పించడం కోసం, అడవి రక్షణ కోసం.. దరఖాస్తులు ఏ విధంగా రూపొందించాలన్న అంశాలపై సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించి ఫార్మాట్‌ రూపొందించారు. దరఖాస్తు ఏ విధంగా ఉండాలి.. అందులో పొందుపరిచే అంశాలు, అటవీ సరిహద్దుల కోఆర్డినెట్స్‌ నిర్ణయం, వివిధ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు, అటవీ పరిరక్షణకు పౌరుల భాగస్వామ్యం తదితర అంశాలపై సీఎస్‌ నివేదిక సిద్దం చేయగా, శనివారం జరిగే సమీక్షలో సీఎం వీటిని పరిశీలించి నిర్ణయాలు వెల్లడించనున్నారు. రాష్ట్రంలో పోడుసాగుదారులకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనలేకపోగా.. దరఖాస్తుల స్వీకరణ ద్వారా అసలు లెక్క తేలడంతో పాటు.. ఈ సమస్యకు శాశ్వతంగా చెక్‌ పెట్టేలా, అడవి రక్షణ బాధ్యతలు.. హద్దుల రక్షణ బాధ్యతలు, గంజాయి సాగు నిరోధ బాధ్యతల వంటివి కూడా వీరికి అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. బాధ్యతలు విస్మరించినా, నిర్లక్ష్యం ప్రదర్శించినా ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు రద్దుచేసేలా విధానాన్ని రూపొందిస్తున్నారు. గజం అడవి కూడా అన్యాక్రాంతం కావొద్దు.. అదేక్రమంలో దశాబ్దాలుగా పోడునే నమ్ముకున్న గిరిజనుల ఉపాధి దెబ్బతినొద్దు.. ఈరెండూ పరిగణనలోకి తీసుకుని విధాన రూపకల్పన చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూపొందించిన హరితహారం.. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ తరహా కార్యక్రమం సక్సెస్‌ కాని రీతిలో సక్సెస్‌ కాగా, గ్రీన్‌ కవర్‌ గణనీయంగా పెరిగింది. ఇపుడు పెరిగిన గ్రీన్‌ కవర్‌ను కాపాడుకుంటూ.. మరింత పెంపొందించేదిశగా సీఎం కేసీఆర్‌ పోడు సమస్య పరిష్కారానికి సరికొత్త ప్లాన్‌ను సిద్దం చేశారు. అసెంబ్లిస వేదికగానే పోడు సమస్య పరిష్కారానికి వ్యూహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్‌.. విధివిధానాలు, దరఖాస్తుల అంశాలపై శనివారం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Advertisement

తాజా వార్తలు

Advertisement