Saturday, April 20, 2024

30 లక్షల విలువైన విదేశీ సిగరెట్లు పట్టివేత

అమరావతి, ఆంధ్రప్రభ : విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న రూ.30లక్షల విలువైన విదేశీ సిగరెట్లను విజయవాడ కస్టమ్స్‌ ప్రివెంటివ్‌ కమిషనరేట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్‌ ప్రివెంటివ్‌ కమిషనరేట్‌ కమిషనర్‌ కే.ఇంజనీర్‌ కథనం ప్రకారం..ఏపీకి పెద్ద ఎత్తున విదేశీ సిగరెట్లు దిగుమతి అవుతున్నట్లు వచ్చిన సమాచారంపై అధికారులను అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగా సోమవారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట చీరాల రోడ్డులో విదేశీ సిగరెట్లను రిక్షాల నుంచి దించుతుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

తెల్లని బ్యాగులను తెరిచి చూడగా పారిస్‌ కంపెనీ సిగరెట్లు ఉన్నాయి. మొత్తం అన్ని బ్యాగుల్లో రూ.30లక్షల విలువైన మూడు లక్షల సిగరెట్లు ఉన్టన్లు గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత తొమ్మిది నెలల వ్యవధిలో విజయవాడ కస్టమ్స్‌ ప్రివెంటివ్‌ కమిషనరేట్‌ అధికారులు రూ.15 కోట్ల విలువైన 16 మిలియన్ల విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఇంజనీర్‌ తెలిపారు. పట్టుబడిన విదేశీ సిగరెట్లకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement