Thursday, April 25, 2024

గడ్డి కోసం, గొడ్డు కష్టం.. యంత్రాల వినియోగంతో పశువులకు దొరకని మేత..

అందోల్‌, (ప్రభన్యూస్‌) : గత ఏడేళ్ల నుంచి కూలీల కొరత ఎక్కువైంది. యంత్రాల వినియోగం అనివార్య మైంది. పక్వానికి వచ్చిన వరిని కోసేందుకు హార్వెస్టర్‌, నూర్చగా వచ్చిన గడ్డిని కట్టలుగా కట్టేందుకు మిషన్ల వాడకం పరిపాటిగా మారింది. వాస్తవంగా మనుషులు వరి కోతలు కోస్తే గ్రాసం సమస్య ఉండదు. కట్టలు కూడా ఒకే వరుసలో ఉంటాయి. కాబట్టి రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. రానురాను కూలీల కొరత ఎక్కువ అవుతుండటంతో యంత్రాలను వాడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వరికోత యంత్రాల వినియోగం తో పాటు ప్రభుతం వేసవిలో వరి సాగు వద్దన్న ఫలితంగా రైతులు పశుగ్రాసం కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

వ్యయప్రయాసలతో దూర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, లారీలతో వరి గడ్డిని ఇళ్లకు తరలిస్తున్నారు. మండలంలో సగానికిపైగా గ్రామాల్లో రైతులు ప్రభుత సూచనల మేరకు ఈ ఏడాది వరికి బదులు పత్తి, మిరప సాగు చేశారు. దీనివల్ల ఆయా గ్రామాల్లో పశుగ్రాసం కొరత ఏర్పడింది. కొందరు రైతులు పశుగ్రాసాన్ని సమకూర్చలేక పశువులను అమ్ముకున్నారు. కొందరు రైతులు ఇతర ప్రాంతాల నుంచి గడ్డి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుం ట్రాక్టర్‌ ట్రక్కు వరిగడ్డి కొనుగోలుకు రూ.ఆరు నుంచి ఏడు వేలు ఖర్చవుతుండగా, రవాణాకు మరో రూ.మూడు వేలు చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇంత ఖర్చు చేసినా ట్రక్కు గడ్డి నాలుగు నెలలకు మించి రావడంలేదని రైతులు వాపోతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement