Friday, April 26, 2024

వరద నిర్వహణకు రూ. 6,686 కోట్లు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వరద నిర్వహణ కార్యక్రమం (ఎఫ్ఎంపీ)కు దేశవ్యాప్తంగా రూ. 6,686.79 కోట్లు విడుదల చేశామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వరద నియంత్రణ, కోత నిరోధం, నీటి పారుదల అభివృద్ధి, సముద్రపు కోత నిరోధం తదితర పనుల కోసం రాష్ట్రాలకు కేంద్ర సహాయాన్ని అందించడానికి వరద నిర్వహణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నకి కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈ కార్యక్రమం కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు దాదాపు రూ.6,686.79 కోట్లు విడుదల చేశామన్నారు. వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అన్న ఆయన, రాష్ట్రంలో ఏ ప్రాజెక్టూ క్రియాశీలకంగా లేదని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement