Tuesday, March 26, 2024

డ్రోన్లతో ఫుడ్ డెలివరీ.. రంగంలోకి వాల్ మార్ట్..

ప్ర‌భ‌న్యూస్: ఫుడ్‌ డెలివరీ సంస్థలు డ్రోన్ల సాంకేతికతకు మొగ్గుచూపు తున్నాయి. ఈక్రమంలో అమెరికా రిటైలర్‌ సంస్థ వాల్‌మార్ట్‌ కూడా కమర్షియల్‌ డ్రోన్‌ ఫుడ్‌ డెలివరీ స్‌ను ప్రారంభించింది. వాల్‌మార్ట్‌ సంస్థ ఫుడ్‌తోపాటు డైపర్లను సైతం డెలివరీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా వాల్‌మార్ట్‌ తమ తొలి కమర్షియల్‌ యూఎస్‌ డ్రోన్‌ డెలివరీ సేవను అర్కాన్సాస్‌లో పీరిడ్జ్‌లోని 50మైళ్ల పరిధిలో మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఈనేపథ్యంలో అర్కాన్సాస్‌లోని ఫార్మిం గ్‌టన్‌లో నివసించే వినియోగదారులు తమ ఆర్డర్లను ఆకాశ మార్గం ద్వారా అందుకోవచ్చు. ఈ జిప్‌లైన్‌ డ్రోన్లు పారాచూట్‌ లాడెన్‌ ప్యాకేజీలను కస్టమర్ల చేతికి అందేలా డ్రాప్‌ చేస్తాయి. వాల్‌మార్ట్‌ డ్రోన్‌ డెలివరీలను క్రమక్రమంగా విస్తరించనుంది.

అర్కాన్సాస్‌లోని ఫార్మింగ్‌టన్‌లో నివసించే కస్టమర్లు చిన్న వస్తువులను ఆర్డర్‌ చేయవచ్చు. కాగా వాల్‌మార్ట్‌ మొత్తం 26వస్తువులను డ్రోన్ల ద్వా రా కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు సమాచారం. ఆహారపదార్థాలు, బేబీ ఫుడ్‌తోపాటు ప్యాక్‌ డైపర్లు, పేపర్‌ప్లేట్లు, ట్రాష్‌బ్యాగ్‌లు, క్రేయాన్లు తదితర వస్తువులను వాల్‌మార్ట్‌ డ్రోన్ల ద్వారా డెలివరీ చేయనుంది. వస్తువుల బరువునుబట్లి డెలివరీ ఛార్జీలు వసూలు చేయనున్నారు. 4పౌండ్ల బరువు లేదా అంతకంటే తక్కువ బరువున్న వస్తువుల డ్రోన్‌ డెలివరీకి 10డాలర్లను డెలివరీ ఫీజుగా వాల్‌మార్ట్‌ వసూలు చేయనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement