Friday, March 29, 2024

ట్విట్ట‌ర్ లో ధ‌నుశ్ ని ఫాలోఅవుతున్న -11మిలియ‌న్లకి పైగా ఫాలోవ‌ర్స్

త‌మిళ స్టార్ హీరో ధ‌నుశ్ ని ట్విట్ట‌ర్ లో 11మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఫాలో అవుతున్నారు. దాంతో సోషల్ మీడియాలో రేర్ మైల్ స్టోన్ చేరుకున్నారు. సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట‌ర్‌లో ధ‌నుష్ ఫాలోవ‌ర్ల సంఖ్య‌ 11 మిలియ‌న్లు దాటింది. ఈ అరుదైన మైల్ స్టోన్ చేరుకున్న మొద‌టి కోలీవుడ్ న‌టుడిగా ధ‌నుష్ నిలువ‌డం విశేషం. అంతే కాదు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఈ ఘనత సాధించిన రెండో యాక్ట‌ర్‌గా నిలిచారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ స్టార్ హీరో రీసెంట్‌గా మిత్ర‌న్ ఆర్ జ‌వ‌హ‌ర్ డైరెక్ష‌న్‌లో న‌టించిన సినిమా తిరు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి స‌క్సెస్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. తిరు సినిమా స‌క్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారుధ‌నుష్. అంతే కాదు ప్ర‌స్తుతం ఆయన తన అన్న సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాన్ వ‌రువెన్ సినిమా చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement