Tuesday, April 16, 2024

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్ మారింది

పండగ సీజన్ కోసం ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన ది బిగ్ బిలియన్ డేస్ డేట్ మారింది. తొలుత ఈ సేల్‌ను వచ్చే నెల 7 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే ప్రస్తుతం అక్టోబర్ 3 నుంచి 10 వరకు మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పలు రకాల ఉత్పత్తులపై భారీ స్థాయిలో ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ అందించనుంది.

మరోవైపు అమెజాన్ కూడా ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తోంది. అమెజాన్ అక్టోబర్ 4 నుంచి ఈ సేల్‌ను ప్రారంభించనుంది. అమెజాన్ 4 నుంచి నిర్వహిస్తున్న కారణంగానే ఫ్లిప్‌కార్ట్ ఒకరోజు ముందుగానే సేల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు ఒకరోజు ముందు నుంచే కొనుగోళ్లు చేసే అవకాశముంది. కాగా ఈసారి అమెజాన్ హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఐసీఐసీఐ కార్డులపై 10 శాతం డిస్కౌంట్లను అందించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement