Wednesday, April 24, 2024

తైవాన్ లో చైనా యుద్ధ విమానాలు..అగ్రరాజ్యం ఆగ్రహం

డ్రాగన్ చైనా మరోసారి తన దుర్భుద్దిని చాటుకుంది. ఎప్పుడు పక్క దేశాలో సరిహద్దులను ఆక్రమించుకోవాలనే తన కపట బుద్దిని మరోసారి బయటపెట్టింది. అంతేకాదు ఈ సారి ఏకంగా యుద్ధ మిమానలతోనే బయలుదేరింది. ఇప్పటికే భూటాన్ ను తన ఆధీనంలోకి తీసుకున్న చైనా తైవాన్ పై కన్నేసింది. ఎప్పటి నుంచో ఆ దేశంపై ఆధిపత్యం తమదే అని చెప్తున్న చైనా ఇప్పుడు మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. 

అన్ని దేశాలు కరోనాతో సతమతమౌతుంటే, చైనా మాత్రం తైవాన్ ను ఎలాగైనా తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నది.  ఇందులో భాగంగా డ్రాగన్ విమానాలు తైవాన్ గగనతలంపై సంచరించడం మొదలుపెట్టాయి.  దాదాపుగా 25 డ్రాగన్ విమానాలు ఎయిర్ డిఫెన్స్ ఇందేంటిఫికేషన్ జోన్ లోకి ప్రవేశించినట్టు తైవాన్ పేర్కొన్నది.  నిత్యం చైనా విమానాలు తైవాన్ లోకి ప్రవేశిస్తూనే ఉన్నా, ఈ ఏడాది అత్యధికంగాఒకేసారి 25 డ్రాగన్ యుద్ధ విమానాలు ప్రవేశించడంతో తైవాన్ షాక్ అయ్యింది.  తైవాన్ గగనతలంలో గత కొంతకాలంగా చైనా విమానాల సంచారం పెరిగినట్టు తైవాన్ వెల్లడించింది.  దీంతో ఆ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తైవాన్ పై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే అమెరికా హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement