Friday, April 19, 2024

Flash Flash : హత్యకు ప్రతీకారంగా ప‌ట్ట‌ప‌గ‌లే యువకుడి దారుణ హత్య

తిరుపతి సిటీ : హత్యకు ప్రతీకారంగా హత్య చేసిన సంఘటన సోమవారం తిరుపతి నగరంలో సంచలనం రేపింది. తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇటీవల కాలంలో హత్యల పరంపర కొనసాగుతున్నది. మరో పక్క ఆర్థిక కారణాల రీత్యా పాత ఘర్షణలు మద్యం మత్తులో యువకులు వీరంగం చేస్తూ హత్యలు చేస్తున్నటువంటి సంఘటన చోటు చేసుకుంటున్నది… వివరాల్లోకి వెళితే తిరుపతి నగరంలోని స్థానిక చింతల చేను వద్ద సుబ్రహ్మణ్యం కుమారుడు లక్ష్మీపతి (28) ఇంటి దగ్గరే వారి తల్లి రత్నమ్మ ముందే వంశి అనే వ్యక్తి యువకుడిని బయటకు పిలుచుకుని వచ్చి అతి దారుణంగా కత్తితో గుండెపైన పొడిచి ఆ తర్వాత పరారయ్యాడు.
హత్య గల కారణాలు :
స్థానిక చింతల చేనుకు చెందిన ప్రసన్న కుమార్ అలియాస్ బొజ్జను తిరుపతి రేణిగుంట రహదారిలో ఓయో హోటల్ దగ్గర మద్యం మత్తులో ఒకరికొకరు ఘర్షణలకు దిగి అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. అతను తానే పంపించానని అప్పుడప్పుడు మద్యం మత్తులో లక్ష్మీపతి అంటుండేవాడు. లక్ష్మీపతి 4 సంవత్సరాల క్రితమే పెరాలసిస్ తో బాధ పడుతూ ఉండేవాడు. హత్యకు యువకుడే కారణమని వారం రోజుల క్రితం కొంతమంది యువకులు వచ్చి లక్ష్మీపతి తల్లిదండ్రులను కూడా బెదిరించడం జరిగింది. వారం రోజులు తిరగకముందే లక్ష్మీపతిని ఇంటి నుంచి పిలిపించి తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న వంశీ అతి దారుణంగా హత్య చేయడం జరిగింది.
లక్ష్మీపతి హత్య చేసిన వారిని త్వరలో పట్టుకుంటాం :
లక్ష్మీపతి అనే యువకుడిని హత్య చేసినటువంటి వారిని త్వరలో పట్టుకుంటామని ఈస్ట్ డీఎస్పీ మురళి కృష్ణ తెలియజేశారు. యువకులు మద్యం మత్తులో అప్పు డప్పుడు వచ్చి ఘర్షణలకు పాల్పడుతుంటారని హత్యకు గురైన లక్ష్మీపతి ఇంటినుంచే వారి తల్లి రత్నమ్మ కళ్ళముందే ఇంటి వద్ద ఉండగానే పిలుచుకుని వచ్చి బయటకు తీసుకుని వచ్చి కుమారున్ని దారుణంగా హత్య చేయడం జరిగిందని వివరించారన్నారు. సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి హత్యకు గలకారణాలు విచారిస్తున్నామన్నారు. అలాగే సిసి ఫుటేజీలను కూడా పరిశీలించి ముద్దాయిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ ల‌ను ఏర్పాటు చేసి త్వరలోనే ముద్దాయిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించినట్లు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement