Saturday, April 20, 2024

డెల్టారకం వైరస్ ను కట్టడి చేస్తున్న ఫైజర్..

డెల్టారకం వైరస్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతోంది. భారత్‌లో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌తో పాటు స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ కూడా డెల్టా వేరియంట్‌పై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఇదివరకే వెల్లడైంది. తాజాగా ఆ జాబితాలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ కూడా చేరింది. తమ టీకా తీసుకుంటే డెల్టారకం వైరస్‌ నుంచి రక్షణ పొందొచ్చని గురువారం ఇజ్రాయెల్‌లో ఫైజర్‌ కంపెనీ అధికారి తెలిపారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం డెల్టారకం కొవిడ్‌-19పై ఫైజర్‌ అత్యంత సమర్థంగా పని చేస్తుందన్నారు. దీనిపై మరింత వివరణ ఇచ్చిన ఫైజర్‌ మెడికల్‌ డెరెక్టర్‌ అలోన్‌ ‘‘ప్రయోగశాల పరిశోధనలు, వివిధ రకాలుగా సేకరించిన డేటా ప్రకారం.. భారత్‌తో పాటు బ్రిటన్‌లో నమోదైన డెల్టా వైరస్‌కు ఒకే రకమైన పోలికలు ఉన్నాయి. ఈ రెండింటిపై ఫైజర్‌ వ్యాక్సిన్‌ 90 శాతం సమర్థవంతంగా పోరాడుతోంది’’ అని తెలిపారు.

ఇజ్రాయెల్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఫైజర్‌ టీకానే విరివిగా వినియోగిస్తున్నారు. ఇక డెల్టా వేరియంట్‌ గురించిన వివరాలు పొందుపరచాల్సి ఉంది. ఇదే అంశంపై ఇజ్రాయెల్‌ వైద్యశాఖ అధికారిణి షారోన్‌ మాట్లాడుతూ ‘‘దీనికి సంబంధించిన డేటాని సేకరించాం. ఇప్పటి వరకు దేశంలో 200 మందికి పైగా డెల్టా వైరస్‌ బారిన పడ్డారు. వారిని పరిశీలిస్తూ, మరింత అధ్యయనం చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో ఇంతవరకు 93లక్షల మందికి పైగా ఫైజర్‌ టీకా పొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement