Friday, April 19, 2024

స్పెయిన్‌తో తొలి మ్యాచ్‌.. భారత హాకీ ఫార్వర్డ్‌ ప్లేయర్‌ సుఖ్‌జీత్‌ సింగ్‌

కొత్త ఏడాదిలో భారత హాకీ జట్టుకు పెద్ద సవాల్‌ ఎదురు కానుంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో పరాజయం తర్వాత స్వదేశంలో హాకీ ప్రపంచకప్‌ ఆడనుంది. దాంతో , ఈ మెగా టోర్నీ కోసం జట్లంతా ఉత్సాహంగా ఎదురు చూస్తోందని భారత హాకీ ఫార్వర్డ్‌ ప్లేయర్‌ సుఖ్‌జీత్‌ సింగ్‌ అన్నాడు. ‘మా అందరిలో టీమ్‌ స్పిరిట్‌ ఉంది. ప్రపంచకప్‌ స్పెయిన్‌తో జరిగే తొలి మ్యాచ్‌ కోసం మేమంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. జట్టులో ప్రతీ ఒక్కరూ పాజిటివ్‌గా ఉన్నారు. అంతే కాదు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తున్నారు’ అంటూ సుఖ్‌జీత్‌ వెల్లడించాడు.

- Advertisement -

హాకీ ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. జనవరి 13 నుంచి 29 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. కప్పు కోసం మొత్తం 16 జట్లు పోటీ పడనున్నాయి. టీమిండియా గ్రూప్‌ బిలో ఉంది. అందులో భారత్‌, స్పెయిన్‌, ఇంగ్లండ్‌, వేల్స్‌ జట్లు ఉన్నాయి. జనవరి 13న రూర్కెలాలో జరిగే మ్యాచ్‌లో టీమిండియా, స్పెయిన్‌తో తలపడనుంది. పోయిన ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత హాకీ జట్టు స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌లో టైటిల్‌ సాధించాలనే కసితో ఉంది. కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించాలని హాకీ ఆటగాళ్లు ఉవ్వీళ్లూరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement