Tuesday, April 23, 2024

NC 22కి కస్టడీ టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్

హీరో నాగచైతన్య ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం రివీల్‌ చేసింది.కాగా ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్‌ ను వదులుతోంది చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రియమణీ నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది . కాగా మరో అప్డేట్‌ ను ఇచ్చేసింది చిత్ర బృందం. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ , టైటిల్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. NC 22 పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు కస్టడీ అనే టైటిల్‌ ను అనౌన్స్‌ చేశారు. ఈ మేరకు చైతూ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement