Wednesday, March 29, 2023

ఆర్మీ శిబిరం వద్ద కాల్పులు… ఇద్దరు పౌరులు మృతి

కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఓ సైనిక శిబిరం వెలుపల శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరొకరు గాయపడ్డారు. మృతులను రాజౌరి నివాసి కమల్‌ కుమార్‌, సురీందర్‌ కుమార్‌గా అధికారులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ఉత్తరాఖండ్‌కు చెందిన అనిల్‌ కుమార్‌గా గుర్తించారు. క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆర్మీ హాస్పిటల్‌లో చేర్చారు. ఈ దుర్ఘటన ఉగ్రవాదుల పనేనని సైనిక అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
   

పౌరుల మృతి చెందడంపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఆర్మీ శిబిరం గేటు వద్ద నిరసిస్తూ శిబిరంపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ జమ్మూ-పూంచ్‌ జాతీయ రహదారిని దిగ్బంధించారు. పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అదుపుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement