Wednesday, April 24, 2024

ఎలక్ట్రిక్ స్కూటీ లో మంటలు…వీడియో

ఎలక్ట్రిక్ స్కూటీ లో మంటలు వచ్చిన ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తా సమీపంలో రోడ్డు వెళ్తోన్న ఎలక్ట్రిక్ స్కూటీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా వ్యాప్తి చెందటంతో స్థానికులు అప్రమత్తం అయ్యి… స్కూటీని పక్కకు నిలిపి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

అయితే మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారి కలకలం రేపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement