యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని ధర్మోజిగూడలో ఉన్న ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. గురువారం ఉదయం ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తానికి విస్తరించాయి. రసాయన పరిశ్రమ కావడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో చుట్టుపక్కల భారీగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా తెలియరాలేదు.
ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement