Monday, April 15, 2024

పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” సెట్స్ లో అగ్ని ప్ర‌మాదం..

ప్ర‌స్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ లైన‌ప్ లో చాలానే ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒక‌టి హరిహర వీరమల్లు. డైరెక్ట‌ర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియన్ పీరియడ్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ మూవీ సెట్స్‌లో ఇవ్వాల‌ అగ్ని ప్రమాదం సంభవించింది. వచ్చే నెలలో షూటింగ్‌ ప్రారంభించేందుకు తెలంగాణలోని దుండిగల్‌లో వేసిన సెట్‌ ఈ ప్రమాదంలో దగ్ధమైంది.

అదృష్టవశాత్తూ, ఎవరూ గాయపడలేదు. అయితే షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి మరింత సమయం పడుతుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement