Thursday, October 21, 2021

బాలానగర్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ నగరంలోని బాలానగర్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాలానగర్‌లోని పంచశీల కాలనీలో ఉన్న బ్రైట్‌ లాజిస్టిక్స్‌ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి కంపెనీ మొత్తానికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News